చంద్రబాబు కి సవాల్ విసిరిన స్పీకర్ తమ్మినేని సీతారాం

Monday, January 4th, 2021, 07:30:39 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న తాజా పరిణామాల పై అధికార మరియు ప్రతి పక్ష పార్టీ నేతలు మాటల యుద్దాలు జరుపుతున్నాయి. అంతేకాక ఇప్పుడు విగ్రహాల ధ్వంసం విషయాల్లో కూడా టీడీపీ తీరును ఎండగడుతూ వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే మరొకసారి తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేత, స్పీకర్ తమ్మినేని సీతారాం ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే ఓటుకి కోట్లు కేసు లో చంద్రబాబు వాయిస్ అంటూ పలువురు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫోన్ రికార్డ్ లో ఆ గొంతు తనది కాదు అని దబాయిస్తే, కాణిపాకం లోని విఘ్నేశ్వరుని ముందు ప్రమాణం చేద్దాం రా అంటూ తమ్మినేని సీతారాం చంద్రబాబు కి సవాల్ విసిరారు. అయితే మనుషుల్లో దేవుడ్ని చూసే గొప్ప మానవతా వాది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి మీద నిందలు మోపడం తగదు అంటూ హెచ్చరించారు. అయితే కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే స్వార్థ, నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు అంటూ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు.