వారి నిర్లక్ష్యం కారణంగా 3.61 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయారు

Wednesday, January 27th, 2021, 03:00:52 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల విషయం లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఏపీ పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి జి.కే. ద్వివేది మరియు కమిషనర్ గిరిజా శంకర్ ల పై చర్యలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను జారీ చేశారు. వీరి నిర్లక్ష్యం కారణంగా 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాలేదు అని ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు.

అంతేకాక రాష్ట్రం లో 3.61 లక్షల మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే సాంకేతికత మరియు న్యాయ చిక్కుల కారణం గా 2019 జాబితా తో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఇద్దరు అధికారులు కూడా విధి నిర్వహణలో విఫలం అయ్యారు అని, నిబంధనల ఉల్లంఘన ను సర్వీస్ రికార్డ్ లలో నమోదు చేయాలని ఆదేశించారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేపు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఉన్నతాధికారుల అంతా కూడా సమీక్షకు హాజరు కావాలని సి ఎస్ కలెక్టర్ లకు ఆదేశాలను జారీ చేశారు.