రామతీర్థం ఘటన: బీజేపీ శ్రేణుల ఆగ్రహం… సొమ్మసిల్లి పడిన సోము వీర్రాజు

Thursday, January 7th, 2021, 12:02:05 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో విజయనగరం జిల్లాలో రామతీర్థం ఆలయ రాముని విగ్రహం ధ్వంసం ఘటన పట్ల బీజేపీ శ్రేణులు ధర్మ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ సెక్షన్ 30 అమలు లో ఉండటం తో పోలీసులు బీజేపీ శ్రేణులను, నేతలను అనుమతించడం లేదు. రామతీర్థం కూడలి నుండి దేవాలయం వరకు పోలీసులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ధర్మ యాత్ర కి పిలుపు ఇవ్వడం తో పోలీసులు భారీగా చేరుకున్నారు. బీజేపీ శ్రేణులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వం లో అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని అడ్డుకోవడం తో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అయితే పోలీసులు మరియు ఆందోళన కారుల మధ్యన తోపులాట జరగడం తో అక్కడే ఉన్న సోము వీర్రాజు సొమ్మసిల్లి పడిపోయారు. అయితే ఇప్పటికే వైసీపీ మరియు టీడీపీ శ్రేణులకు అనుమతి ఇచ్చిన పోలీసులు, బీజేపీ కి అనుమతి ఇవ్వక పోవడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.