ఏపీ పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో కొనసాగుతున్న వైసీపీ హవా..!

Tuesday, February 9th, 2021, 08:52:47 PM IST

ఏపీలో నేడు తొలిదశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఒకటి రెండు చోట్ల మినహా అన్ని ప్రాంతాలలో పోలింగ్ సజావుగా జరిగింది. అయితే సాయంత్రం 3.30 గంటలకు పోలింగ్ ముగియడంతో 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో తొలివిడతలో భాగంగా 3,249 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 500 పంచాయతీలు వైసీపీ మద్దతుదారులు, 18 చోట్ల టీడీపీ మద్దతుదారులు, 7చోట్ల ఇతరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

దీంతో నేడు 2,723 గ్రామ పంచాయతీలు, 20,157 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో వైసీపీ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

జిల్లాల వారీగా ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు:

* చిత్తూరు(454): వైసీపీ-123, టీడీపీ-11
* గుంటూరు(337): వైసీపీ-88, టీడీపీ-16
* ప్రకాశం(227): వైసీపీ-42, టీడీపీ-11
* కడప జిల్లా (206): వైసీపీ-63, టీడీపీ-2
* నెల్లూరు జిల్లా (163): వైసీపీ-34, టీడీపీ-3
* అనంతపురం(169): వైసీపీ-33, టీడీపీ-12
* కర్నూలు(193): వైసీపీ-57, టీడీపీ-4
* శ్రీకాకుళం(321): వైసీపీ-78, టీడీపీ-10
* తూర్పుగోదావరి (366): వైసీపీ-35, టీడీపీ-0
* పశ్చిమగోదావరి (239): వైసీపీ-48, టీడీపీ-3
* కృష్ణా (234): వైసీపీ-32, టీడీపీ-3
* విశాఖపట్నం (340): వైసీపీ-46, టీడీపీ-3