మీ లాగా రాజకీయ పార్టీలకి మస్కాలు కొట్టడం మాకు చేతకాదు – ఏపీ ఎన్జీఓ

Sunday, January 10th, 2021, 06:23:13 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల విషయం లో ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ను వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. కరోనా తో చాలామంది ప్రజలు, ఉద్యోగులు ప్రాణాలను కోల్పోయారు అని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలు వొద్దని అనేక సార్లు ఎస్ ఈ సి కి విన్నవించాం అని తెలిపారు. అయినప్పటికీ మొండిగా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయడం దారుణ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సరికాదు అని అన్నారు.

తెలుగు దేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు చంద్రశేఖర్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల్లో పని చేసి రాజకీయాల్లోకి వెళ్లి ఆరోపణలు చేస్తున్నారు అని, మీ రాజకీయ పార్టీల సంగతి మీరు చూసుకోండి అని, మీ లాగా రాజకీయ పార్టీలకి మస్కా లు కొట్టడం మాకు రాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉద్యోగ సంఘాల పై అశోక్ బాబు ఆరోపణలు సిగ్గు చేటు అని మండిపడ్డారు. అయితే ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ అనుకూలంగా వ్యవహరించడం, ఇటు వైసీపీ వ్యతిరేకించడం తో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి.