ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తాం

Friday, January 22nd, 2021, 04:00:44 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికలకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పు ను సవాల్ చేస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయం లో అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తుండగా ఇప్పుడు మళ్ళీ ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అయితే ఎన్నికలను బహిష్కరించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్దం అవుతున్నాయి అని అన్నారు. అయితే ఈ నిర్ణయం పై సమ్మెకు వెళ్లేందుకు కూడా సిద్దం గా ఉన్నామని అన్నారు. అయితే పంచాయతీ ఎన్నికలకు ఇది సమయం కాదు అని అన్నారు. అయితే రెండో విడత వాక్సినేషన్ తర్వాత ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించారు. అయితే ప్రాణాలకి తెగించి విధులు నిర్వహించలేము అని, ప్రాణాలకు భరోసా ఇస్తారా అంటూ సూటీగా ప్రశ్నించారు.