హాట్ టాపిక్: ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్

Monday, December 28th, 2020, 04:20:40 PM IST

Do you wish to see NTR Junior as the TDP chief?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న మరొక పేరు జూనియర్ ఎన్టీఆర్. గతం లో తెలుగు దేశం పార్టీ తరపున ప్రచారం చేసిన నందమూరి తారక రామారావు, ఇప్పుడు కేవలం సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధించడంతో టీడీపీ పని అయిపోయింది అంటూ సొంత పార్టీ నేతలు కూడా అంటున్నారు. అయితే ఈ నేపథ్యం లో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఒక ఫ్లెక్సీ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం లో ఏపీ కి నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఒక ఫ్లెక్సీ ఉంది. అయితే ఆ ఫ్లెక్సీ లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో తో పాటుగా, తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతల ఫోటోలు సైతం ఉన్నాయి. అయితే ఈ ఫ్లెక్సీ ను ఎవరు ఏర్పాటు చేశారు అనే దాని పై ఇప్పుడు టీడీపీ లో చర్చలు జరుగుతున్నాయి. అయితే తను ఎప్పటికీ టీడీపీ కి చెందిన వాడినే అని జూనియర్ ఎన్టీఆర్ పలుమార్లు తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే.