మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం మున్సిపల్ పోలింగ్

Wednesday, March 10th, 2021, 06:00:50 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పురపాలక ఎన్నికల పోలింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు 53.57 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఎన్నికల పోలింగ్ కొనసాగనుంది. పలు చోట్ల ఘర్షణ వాతావరణం కనిపిస్తున్నప్పటికీ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లాల వారీగా మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ శాతాన్ని చూసుకున్నట్లైతే శ్రీకాకుళం లో 59.9 శాతం, విజయనగరం 53.31 శాతం, కృష్ణా 52.87 శాతం, తూర్పు గోదావరి 53.08 శాతం, కర్నూలు 48.87 శాతం, అనంతపురం 56.93 శాతం, చిత్తూరు 54.12 శాతం, ప్రకాశం 64.31 శాతం, కడప 56.63 శాతం, నెల్లూరు 61.03 శాతం, విశాఖపట్నం 47.86 శాతం, గుంటూరు 54.42 శాతం, పశ్చిమ గోదావరి 53.68 శాతాలు గా నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.