బిగ్ న్యూస్: చంద్రబాబు పై ఏపీ మంత్రుల ఆగ్రహం

Tuesday, October 13th, 2020, 06:15:39 PM IST

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భారీ వర్షాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది అని మంత్రి కుర సాల కన్నబాబు తెలిపారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పిన విషయాన్ని తెలిపారు. పంటల నష్టం పై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అంతేకాక ఏ ఒక్క రైతు కి కూడా నష్టం జరగనివ్వం అని తెలిపారు. అయితే ఈ మేరకు ప్రతి పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వరుస విమర్శలు చేశారు.

అమరావతి సినిమా పై చంద్రబాబు నాయుడు మూడు శత దినోత్సవాలను పూర్తి చేశారు అని విమర్శించారు. వైజాగ్ పై ఎందుకు చంద్రబాబు కి అంత కక్ష అంటూ సూటిగా ప్రశ్నించారు. సీపీఐ నారాయణ టీడీపీ అజెండా మోస్తున్నారు అని ఆరోపించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు విశాఖ ను రాజధాని కాకుండా ద్రోహం చేస్తున్నారు అని, అమరావతి ను రాజధాని గా కొనసాగించాలి అనడం లో తప్పు లేదు, కానీ విశాఖ ను రాజదాని గా ఒద్దు అనడం ఎంటి అని నిలదీశారు. చంద్రబాబు కి, బినామీ లకు అమరావతి అభివృద్దే ముఖ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.