జూమ్ యాప్ ద్వారా ప్రజల మైండ్ ను జూమ్ చేద్దాం అనుకుంటున్నారా – ఏపీ మంత్రి

Wednesday, December 9th, 2020, 07:30:06 AM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు మానసిక రుగ్మత తో బాధపడుతున్నారు అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల్ కృష్ణ అన్నారు. అయితే అబద్ధాలు చెబితే జనం నమ్ముతారు అని బాబు అనుకుంటున్నారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఏ ఆపద వచ్చినా చలించే వ్యక్తి సీఎం జగన్ అని, చంద్రబాబు నాయుడు ఇంట్లో నుండి కదలరు, బయటికి రారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతా జూమ్ లోనే అని, జూమ్ యాప్ ద్వారా ప్రజల మైండ్ ను జూమ్ చేద్దాం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

అయితే ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు బురద జల్లాలని చూస్తున్నారు అంటూ ఆరోపించారు. బాబు పార్టనర్ పవన్ ఫాం హౌస్ నుండి ప్రభుత్వం పై బురద జల్లుతున్నారు అని విమర్శించారు. చంద్రబాబు పాలన లో కరువు తాండవించింది అని, జగన్ పాలన లో పుష్కలం గా నీరు ఉందని తెలిపారు. చంద్రబాబు జూమ్ మీటింగ్ ల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని అన్నారు. టీడీపీ వ్యవసాయ బిల్లు కి వ్యతిరేకంగా ఓటు వేయకపోగా, ఇక్కడ ముసలి కన్నీరు కారుస్తున్నారు అని అన్నారు. రైతులకు అన్యాయం జరిగితే బాబు ఢిల్లీ లో ఎందుకు దీక్ష చేయలేదు అని,చంద్రబాబు ఇప్పుడు నల్లచొక్క ఎందుకు వేసుకోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.