కేశినేని నాని ఓ పెద్ద గజదొంగ – వెల్లంపల్లి శ్రీనివాస్

Thursday, February 25th, 2021, 01:02:30 PM IST

తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతల పై అధికార పార్టీ నేతలు వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అధికార పార్టీ వైసీపీ కి చెందిన నేత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ నేతల పై వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనా విధానం పై ప్రశంశల వర్షం కురిపిస్తూనే, టీడీపీ పై విమర్శలు చేశారు. ప్రభుత్వం పై ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఆపలేరు అని వ్యాఖ్యానించారు. రైల్వే ఇరిగేషన్ స్థలాలను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు. అంతేకాక రైల్వే స్థలం పై కేంద్ర రైల్వే మంత్రి కి సీఎం జగన్ మోహన్ రెడ్డి లేఖ రాసిన విషయాన్ని మంత్రి తెలిపారు.

అయితే అధికారంలో ఉన్నప్పుడు దోచుకో, దాచుకో అన్న విధంగా టీడీపీ నేతలు వ్యవహరించారు అని, కార్మికుల జీతాలు కేశినేని నాని ఎగ్గొట్టారు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు తన కూతురిని మేయర్ ను చేయాలని చూస్తున్నారు కేశినేని నాని అంటూ విమర్శించారు. కేశినేని నాని ఓ గజదొంగ అని, కుప్పం లో అలజడులు సృష్టించేందుకే చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ను ప్రజలు ఛీ కొట్టినా సిగ్గు రాలేదు అని, ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతిని మార్చుకోవాలి అని అన్నారు. మా ప్రభుత్వం లో అవినీతిని సహించం అని, ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ ఏసీబీ దాడులు చేస్తుంది అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. అవినీతి రహిత పాలనే మా ధ్యేయం అంటూ చెప్పుకొచ్చారు.