బిగ్ న్యూస్: టెన్త్ ఇంటర్ పరీక్షలు యధాతథం…ఏపీ విద్యా శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు

Monday, April 19th, 2021, 04:29:16 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజు కూడా వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు పరీక్షలు రద్దు చేయాలని ప్రతి పక్ష పార్టీ నేతలు కోరుతున్నారు. అయితే ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రేపటి నుండి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు మంత్రి ఆదిమూలపు సురేష్. అంతేకాక ఒకటి నుండి తొమ్మిదవ తరగతి వరకు క్లాసులు రద్దు చేయడం జరిగింది. అంతేకాక ఒకటి నుండి తొమ్మిదవ తరగతి వరకు అందరిని కూడా ప్రమోట్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ కట్టడికి చర్యల పై చర్చ జరిపాం అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే టెన్త్ మరియు ఇంటర్ పరీక్షలు యధాతధంగా జరుగుతాయి అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతి పక్ష పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.