ప్రైవేటీకరణ మా చేతిలో ఉంటే మమ్మల్ని తిట్టండి – మంత్రి సిదిరీ అప్పలరాజు

Wednesday, February 17th, 2021, 08:25:53 AM IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయం లో వైసీపీ ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. విశాఖ వెళ్లి నిరసన దీక్ష చేపట్టిన పల్లా శ్రీనివాస్ రావు ను ఆసుపత్రి లో పరామర్శించారు. అయితే విశాఖ లో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ కీలక నేత, మంత్రి సిదిరి అప్పలరాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు నాయుడు విశాఖ వచ్చారు అంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తన మాటలతో ప్రజలను రెచ్చగొడుతున్నాడు అని మంత్రి తెలిపారు. మాకేమన్న ఉద్యమాలు అంటే కొత్తా? ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రం ను ఒక్క మాట అనడు అని, మూడు అంటే చంద్రబాబు కి భయం అని విమర్శించారు. ప్రైవేటీకరణ మా చేతిలో ఉంటే మమ్మల్ని తిట్టండి అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. అప్పుడు మేం పడతాము అని చెప్పుకొచ్చారు. అడ్డమైన వాళ్లకు ఉత్తరాలు రాసే చంద్రబాబు ప్రధాని మోడీ కి ఎందుకు రాయడు అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు అధికారం లో ఉండగా పోస్కో తో జరిగిన చర్చల ను ప్రస్తావిస్తూ చంద్రబాబు తీరును తప్పుబట్టారు.