కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన వైసీపీ మంత్రి.. కారణం అదే..!

Wednesday, December 23rd, 2020, 03:00:27 AM IST

ఏపీ రాష్ట్రంలో గల 16 ప్రధాన పోర్టులను, పట్టణాలను కలిపేలా రహదారుల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ నేడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఏపీ మంత్రి శంకర్ నారాయణ కలిశారు. అయితే దీనితో పాటు విశాఖ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు నాలుగు లైన్ల రోడ్డు నిర్మించాలని కూడా మంత్రి శంకర్ నారాయణ గడ్కరీ గారికి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి శంకర్ నారాయణ విజయవాడ-బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ హైవేను ఫస్ట్‌ ఫేజ్‌లోనే చేపట్టాలని, విజయవాడలో రద్దీ తగ్గించడానికి ఖాజా టోల్‌గేట్ మరియు పొట్టిపాడు మధ్య బైపాస్ రోడ్డు నిర్మించాలని అన్నారు. అంతేకాకుండా హైవేలపై రైల్వే క్రాసింగ్ వద్ద చేపట్టే వంతెనల నిర్మాణ వ్యయాన్ని రైల్వేశాఖ 50 శాతం, కేంద్రం మరో 50 శాతం భరించాలని కోరానని దీనికి గడ్కరి గారి నుంచి కూడా సానుకూల స్పందనే వచ్చిందని అన్నారు.