ఢిల్లీ లో రఘురామ కృష్ణంరాజు, హైదరాబాద్ లో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు

Friday, August 21st, 2020, 08:21:12 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న పరిణామాల పై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ప్రతి పక్ష పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఘాటు విమర్శల పై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తాజాగా స్పందించారు. తిరుమలలో శ్రీవారి ను దర్శించుకున్న అనంతరం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఏ ఒక్క కులానికో, మతానికో అంటగడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీ లో కూర్చొని రఘురామ కృష్ణంరాజు, హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విగ్రహాలు వీధుల్లో పెట్టరాదు అనే నిర్ణయానికి ముందు అన్ని పార్టీలు, మఠాధిపతులు, పీఠాదిపటులతో మాట్లాడం అని అన్నారు. రఘురామ కృష్ణంరాజు గత అయిదు నెలలుగా సొంత నియోజకవర్గానికి రాలేదు అని అన్నారు. నియోజక వర్గం పై ప్రేమ ఉంటే ఎందుకు అక్కడ చవితి వేడుకల్లో పాల్గొనలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నీచ రాజకీయాలు చేస్తూ రఘురామ కృష్ణంరాజు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పని చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.