ఆ అయిదు కోట్ల రూపాయలతో నాకు ఎలాంటి సంబంధం లేదు – ఏపీ మంత్రి

Thursday, July 16th, 2020, 10:18:55 PM IST


తమిళనాడు రాష్ట్రంలో పట్టుబడ్డ అయిదు కోట్ల రూపాయల వ్యవహారం పై టీడీపీ నేతలు ఇప్పటికే వరుస విమర్శలు చేస్తున్నారు. నారా లోకేష్ ఈ ఘటన పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ పార్టీ పై ధ్వజమెత్తారు. అయితే ఈ అయిదు కోట్ల రూపాయలు తమవే అంటూ ఒంగోలు బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు అన్నారు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే నగదు ఉంచాం అని, బంగారం కొనేందుకు చెన్నై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు అని వివరించారు. అయితే ఈ వ్యవహారం పై టీడీపీ నేతలు చేసిన విమర్శలకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా బదులు ఇచ్చారు.

చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ అయిదు కోట్ల రూపాయలతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని, టీడీపీ నేతలు అవాస్తవాలని ప్రచారం చేస్తున్నారు అని, కావాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా తనను ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.