ఇచ్చిన ప్రతి మాటను సీఎం జగన్ నిలబెట్టుకుంటున్నారు – మంత్రి బొత్స

Friday, September 11th, 2020, 01:57:40 AM IST


ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. అయితే ఇచ్చిన ప్రతి మాటను కూడా సీఎం జగన్ నిల నెట్టుకుంతున్నారు అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే ఏపీ లో 65 వేల కోట్ల రూపాయల కి పైగా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 11 చరిత్రలో నిలిచే రోజు అనే, ఆరోజు ఆసరా పథకాన్ని ప్రారంభించనున్నారు అని తెలిపారు.

అయితే 90 లక్షల మంది మహిళల కి బటన్ నొక్కి వారి ఖాతా లో మొదటి విడత డబ్బు వేయనున్నారు అని తెలిపారు. నాలుగు ఏళ్లలో 27,128 కోట్ల రూపాయలు ఇస్తున్నారు అని బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే భారత దేశం లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి హామీలను అమలు చేసిన దాఖలలు లేవు అని అన్నారు.రేపు ఒక్క రోజే 6,792 కోట్ల రూపాయలువిడుదల చేస్తున్నట్లు తెలిపారు.