యువతకి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారు – మంత్రి అవంతి శ్రీనివాస్

Tuesday, January 12th, 2021, 06:44:20 PM IST

విశాఖ లో ఉడా చిల్డ్రన్ థియేటర్ లో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని భారత దేశ యువత శాసిస్తుంది అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మంత్రి తో పాటుగా పలువురు వైసీపీ నేతలు, ఎమ్మెల్యే లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని, ఈ విషయాన్ని వివేకానంద ఎప్పుడో చెప్పారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే యువత కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారు అని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లు ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తున్న విషయం ను మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.