సీఎం జగన్ పాలన దేవుడిచ్చిన వరం – ఏపీ మంత్రి

Monday, January 4th, 2021, 05:39:22 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ కి మరియు ప్రతి పక్ష తెలుగు దేశం పార్టీ కి మధ్యలో మాటల యుద్దాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మేరకు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రతి పక్ష పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి పక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే మీడియా సమావేశం లో మాట్లాడిన ఈయన చంద్రబాబు నాయుడు పై సంచలన ఆరోపణలు చేశారు. ఆలయాల పై దాడులు, విగ్రహాల ధ్వంసం వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అంటూ ఆరోపించారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి పాలనా విధానం పై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుల మతాలకు అతీతంగా పాలన చేస్తున్నారు అని కొనియాడారు.అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ పథకం ప్రవేశ పెట్టినా, ఇలాంటి కుట్రలు చంద్రబాబు చేస్తున్నారు అని అన్నారు.

అయితే సీఎం జగన్ పాలన దేవుడిచ్చిన వరం అని, అందుకే తొలిరోజు నుండే రాష్ట్రం లో వర్షాలు సమృద్దిగా కురుస్తున్నాయి అని తెలిపారు. అయితే విగ్రహాలను ధ్వంసం చేస్తున్న చంద్రబాబు కి దేవుడు తగిన బుద్ది చెబుతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.