బీసీలకు అసలైన సంక్రాంతి పండుగ – ఏపీ మంత్రి

Thursday, December 17th, 2020, 12:02:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కార్యకర్తలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యే లు, ఎంపీ లు, మంత్రులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సీఎం జగన్ పాలనా విధానం లో ఎన్నో పెను మార్పులు సంభవించాయి అని చెప్పుకొస్తున్నారు. అయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చారిత్రాత్మక ఘట్టానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. బీసీ లకు అసలైన సంక్రాంతి పండుగ అని అన్నారు.

బీసీ ల అభ్యున్నతి కి సీఎం జగన్ బంగారు బాట వేశారు అని చెప్పుకొచ్చారు. అయితే 56 బీసీ సంక్షేమ సంఘం లను ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్ దే అంటూ కొనియాడారు. ఏలూరు బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారు అని, బీసీ లను ఆర్ధిక, రాజకీయ అభ్యున్నతికి సీఎం జగన్ పెద్ద పీట వేశారు అని చెప్పుకొచ్చారు. అయితే గత పాలకులు మాత్రం బీసీ లను ఓటు బ్యాంకు గానే చూశారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.