తండ్రి ఆశయాల కోసం…మహానేత ప్రజలకు ఇచ్చిన మాట కోసం..!

Friday, November 6th, 2020, 02:30:54 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి పక్ష పార్టీ గా ఉండగా, మూడేళ్ల క్రితం ఇదే రోజున ప్రజా సంకల్ప యాత్ర ను ప్రారంభించారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయాల్లో సీఎం జగన్ పాలన విధానం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఆశయాల కోసం, మహానేత ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర ను ప్రారంభించారు అని మంత్రి వ్యాఖ్యానించారు.

ఏపీ లో అవినీతి తాండవం చేస్తున్న సమయంలో పాదయాత్ర లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల సమస్యలను విని వారికి అండగా నిలిచారు అని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే భారత దేశం లో ఇప్పటివరకు ఎవరికి ఇవ్వని విజయాన్ని ఏపీ ప్రజలు జగన్ కి ఇచ్చారు అని వివరించారు. పాదయాత్రలో చూసిన కష్టాలను పథకాలు గా మలిచారు అని, గత ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా ఉక్క సంకల్పం తో పాలన ప్రారంభించారు అని, ఏడాదిన్నర గా హామీలు అమలు చేస్తూనే ఉన్నారు అని, ఏడాదిన్నర లోనే 90 శాతం కి పైగా హామీలను అమలు చేసిన సీఎం జగన్ కె దక్కుతుంది అని అన్నారు. అయితే సీఎం జగన్ పథకాలను జనంలోకి తీసుకెళ్తామని, ప్రతి పక్ష పార్టీల దుష్ట ఆలోచనలను ప్రజలకు వివరిస్తాం అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.