సీఎం జగన్ 95 శాతం హామీలు అమలు చేశారు

Friday, January 1st, 2021, 07:36:18 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రశంశల వర్షం కురిపించారు. ప్రజల సమస్యలు తీర్చడానికే సీఎం జగన్ మోహన్ రెడ్డి నవ రత్నాలను ప్రవేశ పెట్టారు అని తెలిపారు. అయితే ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు అని పేర్ని నాని అన్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే దశల వారీగా బ్రాందీ షాపులను తగ్గిస్తున్నారు అని, రాబోయే కాలంలో బ్రాందీ షాపులను నిర్మూలన చేస్తారు అని అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మద్యానికి బానిసలు అయిన కుటుంబంలో పిల్లలు కార్మికులుగా పనిచేస్తున్నారు అని తెలిపారు. అయితే దాన్ని అధిగమించడానికి అమ్మ వడి పథకం రూపు దిద్దుకుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే సీఎం జగన్ చెప్పారు అంటే చేస్తారు అంతే అంటూ జగన్ మోహన్ రెడ్డి గారి ను ప్రశంసించారు. సుమారు 10 కోట్ల రూపాయల తో 30 లక్షల 54 వేల మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశారు అని పేర్ని నాని అన్నారు. అయితే ఇళ్లు లేని వారు దరఖాస్తు చేసుకుంటే, 90 రోజుల్లో ఇళ్లు కట్టించి ఇస్తాం అంటూ హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 95 శాతం హామీలను అమలు చేశారు అంటూ పేర్ని నాని అన్నారు.