తెలంగాణ అధికారులపై ఏపీ మంత్రి పేర్ని నాని అసహనం..!

Thursday, March 26th, 2020, 11:00:20 PM IST

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే హైదరబాద్‌లోని హాస్టళ్ళు మూసివేయడంతో హాస్టళ్ళలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులను నిన్న తమ నివాసాలకు వెళ్ళిపోమని పోలీసులు వారందరికి ఎన్‌ఓసీలు జారీ చేశారు.

దీనితో హైదరాబాద్‌లో ఉన్న ఏపీ విద్యార్థులు కూడా ఎన్‌వోసీలు తీసుకుని తమ సొంతూరికి బయలుదేరగా వారిని ఏపీ బార్డర్ జగ్గయ్యపేట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే దీనిపై స్పందించిన ఏపీ మంత్రి పేర్ని నాని తెలంగాణలోని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు ఆవేశంగా తీసుకున్న నిర్ణయాల వలనే ఈ సమస్య తలెత్తిందని తీరా బార్డర్ వరకు వచ్చి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఎక్కడ వారు అక్కడే నిలిచిపోవాలని అన్నారు.