పవన్ కళ్యాణ్ ఆటలో అరటిపండు – పేర్ని నాని

Wednesday, December 30th, 2020, 07:41:11 AM IST

జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల పై, రాష్ట్ర మంత్రుల పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అని చెప్పి, ప్రశ్నించడమే మర్చిపోయారు అంటూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిపోగానే మోడీ కాళ్ళ దగ్గరికి చేరిన పవన్, చిడతలు కొట్టాడు అంటూ విమర్శించారు. అయితే తను వైఎస్ భక్తుడి ను అని, స్వామి భక్తి అని, చనిపోతూ కూడా వైఎస్ కుటుంబానికే భజన చేస్తా అంటూ మంత్రి పేర్ని నాని అన్నారు.

అయితే డబ్బుల కోసం చిడతలు కొట్టే వాడిని కాదు అంటూ చెప్పుకొచ్చారు. చిడతలు వాయిస్తూ డబ్బులు సంపాదించడం చిడతల నాయుడి కే చెల్లింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 లో పవన్ మీటింగ్ పెట్టీ మోడీ కి చిడతలు కొట్టాడు అని, నెల తిరక్కముందే చంద్రబాబు కి చిడతలు కొట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతం లో తుఫాను కారణంగా రైతులు నష్టపోతే చంద్రబాబు, పవన్ ఎంతిచ్చారు అంటూ పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. నువ్వు, నీ పార్టనర్ ఎగ్గొట్టిన ఇన్ పుత్ సబ్సిడీ ను తాము చెల్లించాం అని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఎప్పుడు అయ్యాడు అని, ఏ యూనివర్సిటీ లో పవన్ లా చేశాడు అంటూ వరుస ప్రశ్నలు వేశారు. పవన్ వకీల్ సాబ్ అన్నది ఎంత నిజమో ఆయన రైతుల పట్ల పోరాటం చేసింది అంతే నిజం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆటలో అరటి పండు అంటూ పేర్ని నాని ఘాటు విమర్శలతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.