చంద్రబాబు కి చేతనైంది ఒక్క మోసం చేయడమే – పేర్ని నాని

Sunday, March 7th, 2021, 11:00:21 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చంద్రబాబు ను ఓడించారు అన్న కోపం తో అక్కసు తీర్చుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. పదవి పోయిన తర్వాత చంద్రబాబు కి పిచ్చి పట్టింది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దోచుకున్న డబ్బులను హెరిటేజ్ లో పెట్టారు అని, హెరిటేజ్ అంతా పాపాల పుట్ట అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఏ వ్యాపారం చేసి చంద్రబాబు వందల కోట్ల రూపాయలను సంపాదించారు అంటూ సూటిగా ప్రశ్నించారు పేర్ని నాని. చంద్రబాబు అధికారం లో ఉండి పాపాలు చేసి ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు అని, అమరావతి పేరుతో గుంటూరు, విజయవాడ ను సర్వ నాశనం చేశారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే చంద్రబాబు భూములు దోచుకోవడం లో ఉన్న శ్రద్ద, ప్రజల పై మమకారం, ప్రేమ లేదన్నారు. మాయమాటలతో ఆయన ప్రజలను మభ్య పెట్టారు అని, అందుకే చంద్రబాబు ను 2019 లో వదిలేశారు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక దుర్గమ్మ జోలికి వెళ్లినందుకే, చంద్రబాబు కి మనశ్శాంతి లేకుండా పోయింది అంటూ విమర్శించారు. కుట్రలు, క్షుద్ర రాజకీయాలు మానుకోవాలని, ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు ఒక్క వంతెన కూడా నిర్మించలేదు అని, నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేక పోయారు అంటూ ధ్వజమెత్తారు. ఇప్పుడు ప్రజలకు ఏదో చేస్తా అంటూ మాయ మాటలు చెప్తున్నాడు అని, చంద్రబాబు కి చేతనైంది ఒక్క మోసం చేయడమే అంటూ పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.