ఇసుక టెండర్లలో టీడీపీ నేతలు ఎందుకు పాల్గొనలేదు – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Thursday, March 25th, 2021, 02:34:37 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న తాజా పరిణామాల పై తెలుగు దేశం పార్టీ నేతలు అధికార పార్టీ పై వరుస విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ దురుద్దేశం తోనే ఇసుక టెండర్ల పై తెలుగు దేశం పార్టీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే గత తెలుగు దేశం పార్టీ హయంలోనే ఇసుక దోపిడీ జరిగింది అని, విచ్చలవిడిగా ఇసుకను దోచుకున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇసుక టెండర్ లలో టీడీపీ నేతలు ఎందుకు పాల్గొనలేదు అని సూటిగా ప్రశ్నించారు. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారానే టెండర్లు పిలిచామని మంత్రి స్పష్టం చేశారు. అయితే రూ.120 కొట్లు సెక్యూరిటీ డిపాజిట్ చేసిన సంస్థ దివాళా తీసింది అని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ నిలదీశారు. అయితే వినియోగ దారులకు సక్రమంగా ఇసుక సరఫరా అందిస్తున్నాం అని, సొంతంగా వినియోగదారులే ఇసుకను తరలించెందుకు అవకాశం కల్పించాం అని వ్యాఖ్యానించారు.