చంద్రబాబు రాష్ట్రానికి అన్ని విధాలా నష్టం చేశారు – మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Wednesday, April 7th, 2021, 07:44:54 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం లో చంద్రబాబు దిట్ట అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఆపలేరు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రజా స్వామ్య పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నా స్టే వచ్చింది అని అన్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నూరు శాతం స్థానాల్లో వైసీపీ విజయం తథ్యం అంటూ ధీమా వ్యక్తం చేశారు. అయితే తిరుపతి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి కి దేశంలోనే అత్యధికంగా ఐదు లక్షల మెజారిటీ వస్తుంది అని వ్యాఖ్యానించారు. అయితే ప్రజల కష్టాన్నే పార్టీ మేనిఫెస్టో గా చేసి వాటిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కి అండగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైసీపీ ను గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.

అయితే కుప్పం నియోజకవర్గం లో ప్రజలు తాగు, సాగు నేటికీ ఇబ్బందులు పడుతున్నారు అని, ఈ సమస్యను పరిష్కరించేందుకు త్వరలో సీఎం జగన్ తో సమీక్ష సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 14 ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అన్ని విధాలా నష్టం చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ అధికారం లోకి వచ్చాక 31 లక్షల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది అని, సంక్షేమ పథకాల అమలు తో సీఎం జగన్ పాలన లో దూసుకు పోతున్నారు అని అన్నారు.