చంద్రబాబు ఆదేశాల మేరకే నిమ్మగడ్డ పని చేస్తున్నారు – మంత్రి పెద్దిరెడ్డి

Sunday, February 7th, 2021, 09:38:15 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరొకసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ను సీఎం కుర్చీ లో కూర్చోబెట్టాలి అన్నదే నిమ్మగడ్డ తాపత్రయం అంటూ మంత్రి విమర్శించారు. ఈ క్రమంలో ఎన్నికల కమిషనర్ తప్పు మీద తప్పు చేస్తున్నారు అని, ఎస్ ఈ సీ కి మూడేళ్ల జైలు శిక్ష తప్పదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు ఆదేశాల మేరకే నిమ్మగడ్డ పని చేస్తున్నారు అని ఆరోపించారు. ప్రభుత్వం లోని మంత్రి పై ఎలా చర్యలు తీసుకుంటారు అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే ఎన్నికల అధికారి గా ఉన్న వ్యక్తీ కి నియంత్రణ అనేది ఉండాలి అని అన్నారు. ప్రభుత్వ నిధులతో పని చేస్తూ ఎస్ ఈ సీ ఎప్పుడూ కూడా ప్రభుత్వం చర్చలు జరపలేదు అని, చంద్రబాబు ఆలోచనల తోనే నిమ్మగడ్డ పని చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే రిటైర్డ్ ఐ ఎ ఎస్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీట్లో కూర్చొబెట్టారు కాబట్టి, దురాలోచన లతో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల ఖర్చు కి 43 లక్షల రూపాయలు చెల్లించాల్సిందిగా కోరితే ప్రభుత్వం ఇచ్చింది అని,ఖర్చు లకు మరో కోటి చెల్లించాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై కోర్ట్ లో దావా వేశారు అంటూ మండిపడ్డారు.నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం తో చర్యలు జరపకుండా ఇష్టానుసారం గా వ్యవహరిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక చంద్రబాబు ఇంటి ముందు కాపలా కుక్క లా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.