చంద్రబాబు కి దమ్ముంటే ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలవాలి – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Sunday, February 14th, 2021, 05:49:07 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. విడతల వారీగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు పట్ల, చంద్రబాబు నాయుడు పై పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల్లో గెలిచే దమ్ము ధైర్యం తెలుగు దేశం పార్టీకి లేదు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సహా తెలుగు దేశం పార్టీ నేతలు పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనం స్పష్టమైంది అని, వైసీపీ మద్దతుదారులు ఘన విజయాన్ని సాధిస్తున్నారు అని అన్నారు. అంతేకాక మూడో, నాలుగో విడత లలో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయి అంటూ ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే పుంగనూరు, తంబలపల్లి, మాచర్ల ప్రాంతాల్లో ఎన్నికలు నిలిపి వేయాలి అంటూ తెలుగు దేశం పార్టీ నేతలు కోరడం సిగ్గుచేటు అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలవలేక టీడీపీ కోర్టుల్లో కేసులు వేస్తోంది అని, చంద్రబాబు తానా అంటే కొన్ని చానల్స్, పత్రికలు కూడా తందాన అంటున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు కి దమ్ముంటే ప్రజల మద్దతుతో ఎన్నికల్లో గెలవాలి అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. అయితే ఈ వ్యవహారం పై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.