చంద్రబాబు ఏదో సాధించాలని చతికిలపడ్డారు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Monday, February 22nd, 2021, 02:02:22 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేత, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి పక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు ఏదో సాధించాలని చతికిలపడ్డారు అంటూ విమర్శించారు. తెలుగు దేశం పార్టీ పునాదులు కదులుతున్నా అసత్య కథనాలు రాయిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. అయితే 80.37 శాతం పంచాయితీ లను వైసీపీ మద్దతు దారులు కైవసం చేసుకున్నారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అయితే ఎన్నికలు సజావుగా జరిగితే 90 శాతానికి పైగా గెలిచేవాళ్ళం అంటూ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన కి ప్రజలు పట్టం కట్టారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టేలా ఫలితాలు వచ్చాయి అని, అయితే కుప్పం ఫలితాలే చంద్రబాబు పై వ్యతిరేకత కి నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు. అయితే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాం అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

అయితే పలు చోట్ల తెలుగు దేశం పార్టీ కి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. అందులో ముఖ్యంగా ఒకటి కుప్పం నియోజకవర్గం కాగా, మరొకటి హిందూపురం. తెలుగు దేశం పార్టీ కి కంచుకోట గా ఉన్న ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువ శాతం వైసీపీ గెలుపొందడం గమనార్హం.