కుప్పంలో టీడీపీ కుప్పకూలింది – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Thursday, February 18th, 2021, 01:25:52 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కి ఘోర పరాభవం తప్పలేదు. అయితే తాజాగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఓటమి అంగీకరించాలి అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. తొలి దశ పంచాయతీ ఎన్నికలలో 82.27 శాతం, రెండో దశలో 80 శాతానికి పైగా స్థానాల్లో వైసీపీ గెలిచిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కుప్పంలో తెలుగు దేశం పార్టీ కుప్పకూలింది అని, వైసీపీ 75 స్థానాల్లో విజయం సాధించింది అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

అయితే తెలుగు దేశం పార్టీ కుప్పంలో 14 స్థానాలకే పరిమితం అయింది అని, అయితే ఆ 14 స్థానాలు కూడా అరకొర మెజారిటీ తో వచ్చినవే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పం లో తాము చేసిన అభివృద్దే విజయానికి కారణం అని మంత్రి తెలిపారు.కుప్పం లోనే చంద్రబాబు మెజారిటీ సాధించలేక పోయారు, చంద్రబాబు ఇప్పటికైనా ఓటమిని అంగీకరించాలి అని అన్నారు. తన పదవి నుండి తప్పుకుంటే బావుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబు రాజకీయాల నుండి తప్పుకుంటారా లేఖ రాజీనామా చేస్తారా అనేది తేల్చుకోవాలి అని, ఇకనైనా బుద్ది తెచ్చుకొని మాట్లాడాలి అంటూ చంద్రబాబు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.