బిగ్ న్యూస్: నారా లోకేష్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి

Wednesday, September 30th, 2020, 01:40:43 AM IST

తెలుగు దేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శల పై, చంద్రబాబు నాయుడు తీరు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు అని అన్నారు. సస్పెండ్ జడ్జి రామకృష్ణ సోదరుడి పై దాడి జరిగితే తమకు అంటగట్టాలని చూస్తున్నారు అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలియకుండా నారా లోకేష్ ట్వీట్స్ చేస్తే, చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే జడ్జి రామకృష్ణ సోదరుడి పై దాడి చేసింది తెలుగు దేశం పార్టీ కి చెందిన వ్యక్తి ది అని తేలింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం సమాధానం ఇస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజలు అంతా కూడా చంద్రబాబు నాయుడు తీరును గమనించాలి అని, రామకృష్ణ వెనుక టీడీపీ ఉంది అని తేలింది, ప్రతాప్ రెడ్డి వైసీపీ అని తేలితే నేను రాజకీయాలు వదులు కుంటా అని సవాల్ విసిరారు. తెలుగు దేశం పార్టీ కి దళితులు, మైనారిటీ ల పై గౌరవం లేదు అని, అధికారం పోయె సరికి చంద్రబాబు కి వారిపై ప్రేమ పుట్టుకొచ్చింది అంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.