చంద్రబాబు డైరెక్షన్ లోనే ఈనాడు, ఆంధ్రజ్యోతి పని చేస్తున్నాయి – మంత్రి కన్నబాబు

Friday, April 23rd, 2021, 07:38:48 AM IST

ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ను అడ్డుపెట్టుకొని కొన్ని పత్రికలు దిగజారి ప్రవర్తిస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. ప్రజలను భయ భ్రాంతులకి గురి చేస్తున్నాయి అని అన్నారు. అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల కు సామాజిక బాధ్యత లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే తెలుగు దేశం పార్టీ అధికారం లో లేకుంటే రాష్ట్రంలో కల్లోల పరిస్థితి ఉన్నట్లు చిత్రీకరిస్తున్నాయి అంటూ విమర్శలు చేశారు. అయితే ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు అంటూ మండిపడ్డారు మంత్రి కురసాల కన్నబాబు.

అయితే తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి పై సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు పని చేస్తున్నాయి అని సంచలన ఆరోపణలు చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కనిపించడం లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఇలాంటి విపత్తు సమయాల్లో ఎల్లో మీడియా శవాల పై రాజకీయం చేయడం హేయమైన చర్య అంటూ చెప్పుకొచ్చారు. అయితే తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని, నిరంతరం వ్యవసాయం పై సమీక్ష చేస్తాం అని వ్యాఖ్యానించారు. అయితే ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే మిర్చి, మామిడి, బత్తాయి ధరలు పడిపోయాయి అని పిచ్చి రాతలు రాస్తారా అంటూ సూటిగా ప్రశ్నించారు. రైతులను ఆందోళనకు గురి చేసే వార్తలు రాయడం సరికాదు అని కన్నబాబు మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర రాకుంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే మంత్రి కురసాల కన్నబాబు చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.