నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా హుందాగా ఉండాలి – కొడాలి నాని

Wednesday, November 18th, 2020, 12:47:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందుకు వైసీపీ నేతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. అయితే రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు నాయుడు లేఖలకి స్పందిస్తూ ఎన్నికలు నిర్వహించాలి అని అనుకోవడం సిగ్గుచేటు అని కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు.

కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండటం తో ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్దంగా లేరు అని పేర్కొన్నారు. నిమ్మగడ్డ కి రాజ్యాంగ వ్యవస్థ లపై, రాష్ట్ర ప్రభుత్వం పై నమ్మకం లేదు అని తెలిపారు.అంతేకాక నిమ్మగడ్డ రమేష్ కుమార్ చిల్లర రాజకీయాలు చేయకుండా హుందాగా ఉండాలి అని సూచించారు. అయితే ఒక పక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎన్నికలు నిర్వహిస్తామని అనడం అవివేకం అంటూ ఘాటు విమర్శలు చేశారు.

అయితే హైదరాబాద్ లో కూర్చొనే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ అంటూ సెటైర్స్ వేశారు. అయితే జూమ్ బాబు తో చేతులు కలిపి ప్రజలకు నష్టం కలిగించేలా ఎన్నికలు నిర్వహిస్తామని అంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అని మంత్రి కొడాలి నాని అన్నారు.