బిగ్ న్యూస్: చంద్రబాబు పై మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని

Saturday, September 19th, 2020, 10:21:37 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని భూ కుంభకోణానికి సంబంధించి మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు తమ స్వార్థం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు అని అన్నారు. అమరావతి రాజధాని లో ఇన్ సైడర్ జరిగింది అనేది వాస్తవం అంటూ మరొకసారి తేల్చి చెప్పారు. అంతేకాక చంద్రబాబు బినామీ లు రాజధాని ప్రకటనకు ముందే వేల ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు మరొకసారి ఆరోపించారు.

అయితే ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి సీబీఐ విచారణ జరిపించాలి అంటూ కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు తీసుకొని నిర్ణయాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్నారు అని, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అని కొడాలి నాని అన్నారు. అయితే ఈ అంశం పై పార్లమెంట్ లో చర్చ కి రాకుండా అడ్డుపడుతుంది టీడీపీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను, తన సామాజిక వర్గం అన్నదే చంద్రబాబు లక్షణం అంటూ కొడాలి నాని ఆరోపణలు చేశారు. అయిదేళ్లలో 840 బార్ లను ఓపెన్ చేసిన ఘనత చంద్రబాబు దే అంటూ కొడాలి నాని అన్నారు. చంద్రబాబు తన పాలనలో దళితులకు అన్యాయం చేయడం వలన 23 సీట్లకు పరిమితం అయ్యారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇపుడు దళిత శంఖారావం అంటే నమ్మాలా అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక చంద్రబాబు మతాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నారు అని, ఈ జూమ్ రాజకీయాలను ప్రజలు నమ్మరు అంటూ కొడాలి నాని అన్నారు.