చంద్రబాబు గిన్నిస్ రికార్డు సృష్టించారు – మంత్రి కొడాలి నాని

Sunday, March 21st, 2021, 09:06:23 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులను ఎదుర్కోలేక దేశంలోనే అతి ఎక్కువ స్టే లు తెచ్చుకున్న నాయకుడి గా చంద్రబాబు నాయుడు గిన్నిస్ రికార్డు సృష్టించారు అంటూ విమర్శించారు. అయితే చేసిన దొంగ పనులకి సమాధానం చెప్పలేని చవట, దద్దమ్మ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబే అంటూ చెప్పుకొచ్చారు. అయితే రాజధాని అమరావతి అసైన్డ్ భూముల కేసు లో సిఐడి ఇచ్చిన నోటీసుల పై చంద్రబాబు 31 వ స్టే తెచ్చుకున్నాడు అంటూ విమర్శించారు. ఉచ్ఛం, నీచం లేని చంద్రబాబు కోర్టు లో స్టే తెచ్చుకోవడం లో దిట్ట, బ్రోకర్, వెధవ చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీస్ విచారణను ఎదుర్కోలేని పిరికిపంద, తన పై వచ్చిన ఆరోపణల పై సమాధానం కూడా చెప్పుకోలేని చవట దద్దమ్మ చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అయితే నారా లోకేష్ పై సైతం ఘాటు విమర్శలు చేశారు. జయంతి, వర్థంతికి తేడా తెలియని పనికిమాలిన వ్యక్తి పప్పు లోకేష్ అంటూ విమర్శించారు. అయితే చంద్రబాబు పెద్ద బ్రోకర్ అని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు అంటూ చెప్పుకొచ్చారు. కాళ్ళు పట్టుకోవడం, చీకటి ఒప్పందాలు చేసుకోవటమే చంద్రబాబు చరిత్ర అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం జగన్ దెబ్బకు పప్పు, తుప్పులు ఇద్దరూ కూడా ఇంట్లోనే జైలు శిక్ష అనుభవిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్టే తెచ్చుకున్నంత మాత్రాన నిర్దోషి కాదు అని వ్యాఖ్యానించారు.