చంద్రబాబు అండ్ కో పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలి – కొడాలి నాని

Tuesday, March 16th, 2021, 03:22:15 PM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి లో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్ కో భారీ భూ స్కాం లు చేశారు అని, సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి గా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జీఓ లతో దళిత వర్గాలను మోసం చేశారు అంటూ మంత్రి కొడాలి నాని సంచలన ఆరోపణలు చేశారు.అమరావతి లో అసైన్మెంట్ భూముల హక్కుదారులు అయిన దళితులను బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్ర ధర చెల్లించి, అక్రమ జీవో ల ద్వారా చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేశారు అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.

అయితే దళిత వర్గాలను మోసం చేసిన చంద్రబాబు అండ్ కో పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలి అంటూ చెప్పుకొచ్చారు. అంబోతుల అచ్చెన్నాయుడు అరుస్తున్నా, కుక్కల బుద్దా వెంకన్న మోరుగుతున్నా తాము అదిరేది లేదు బెడిరేది లేదు అంటూ చెప్పుకొచ్చారు.అయితే దళితులకు న్యాయం చేసేలా చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలని మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు.