ఎంత నీచానీకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబే – కొడాలి నాని

Thursday, January 7th, 2021, 07:30:07 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న తాజా పరిణామాలు అలజడులు సృష్టిస్తున్నాయి. అయితే అధికార పార్టీ కి చెందిన నేత, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మరొకసారి తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు ఎంత నీచానికైనా దిగజారే వ్యక్తి చంద్రబాబే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం, హోమ్ మంత్రి, డీజీపీ, విజయ నగరం జిల్లా ఎస్పీ లు క్రిస్టియన్ లు అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అర్థ రహితం అని అన్నారు.

అయితే ఈ మేరకు చంద్రబాబు నాయుడు పై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిస్టియన్ లు అయితే కేవలం క్రిస్టియన్ ల కోసం, ముస్లిం లు అయితే ముస్లిం ల కోసం, హిందువులు అయితే హిందువుల కోసమే పని చేస్తారా అంటూ కొడాలి నాని చంద్రబాబు కి సూటి ప్రశ్న వేశారు. అయితే అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేస్తేనే తాను సీఎం అయ్యాడు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గ్రహించాలి అని గుర్తు చేశారు. అయితే కమ్మ కులానికి చెందిన వ్యక్తి కాబట్టే రాజధానిని అమరావతి లో పెట్టీ, తన సామాజిక వర్గం వారితో వేల ఎకరాలు కొనుగోలు చేయించారు అని ఆరోపించారు.

అయితే రాష్ట్రాన్ని తన సామాజిక వర్గానికి దొచిపెట్టిన నీచుడు చంద్రబాబు అంటూ కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రం లో కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించి, అలజడులు రేపాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు అని కొడాలి నాని ఆరోపించారు. అయితే రాష్ట్రానికి వైఎస్ జగన్ సీఎం గా ఉన్నన్ని రోజులు చంద్రబాబు ఆటలు సాగవు అని అన్నారు.