తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని చంద్రబాబు హిందువా..?

Tuesday, September 22nd, 2020, 11:13:09 PM IST

ప్రతి పక్ష పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పార్టీ నేత, మంత్రి కొడాలి నాని మరొకసారి ఘాటు విమర్శలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన పై చంద్రబాబు నాయుడు నీచ రాజకీయం చేస్తున్నారు అంటూ విమర్శించారు. చంద్రబాబు నాయుడు బూట్లు వేసుకొని కొండ ఎక్కితే, సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పులు లేకుండా తిరుమల కొండ ఎక్కారు అంటూ మంత్రి కొడాలి నాని అన్నారు.

అయితే తల్లిదండ్రులకు తలకొరివి పెట్టని చంద్రబాబు నాయుడు హిందువా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎడమ చేత్తో భూమి పూజ చేసిన చంద్రబాబు దంపతులు హిందువులా? చంద్రబాబు ఏనాడైనా తిరుమల లో గుండు కొట్టించుకున్నారా అంటూ మంత్రి వరుస ప్రశ్నలు వేశారు. దేవుళ్ళను తాను ఏనాడు కించపరచలేదు అని, టీడీపీ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా తిరుపతి కి వెళ్తున్నారు,ఇప్పటికే చాలా సార్లు వెళ్ళారు,భవిష్యత్ లో కూడా వెళతారు అంటూ స్పష్టం చేశారు.