ఎస్ఈసి నిర్ణయం వచ్చాకే గ్రామాల్లోనూ అమలు – కొడాలి నాని

Monday, February 1st, 2021, 07:28:39 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల అమలు విషయం లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి కొడాలి నాని స్పందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటి కి రేషన్ సరుకుల పంపిణీ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలి అంటూ మంత్రి నిమ్మగడ్డ కి సూచించారు. అయితే ప్రభుత్వం పథకాల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకం గా వ్యవహరిస్తోంది అని, కులం, మతం, పార్టీలు చూడకుండా, అర్హతే ప్రామాణికంగా అందిస్తోంది అని స్పష్టం చేశారు. అయితే రేషన్ పంపిణీ కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద మొబైల్ వాహనాలను తీసుకొచ్చిన విషయాన్ని మంత్రి వెల్లడించారు.

అయితే ఇంటింటికీ రేషన్ అంటూ తీసుకొచ్చిన పేదలకు ఎంతో అవసరం అంటూ మంత్రి తెలిపారు. ఇది ఎన్నికల కోడ్ కి విరుద్ధం అని, దాన్ని నిలిపేయాలని సి ఎస్ కి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ రాశారు అని మంత్రి కొడాలి నాని అన్నారు. అయితే ఈ వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆశ్రయించిన విషయాన్ని మంత్రి వెల్లడించారు. ఐదు రోజుల్లోగా దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలి అంటూ కోర్టు ఎస్ ఈ సీ ను ఆదేశించడం హర్షణీయం అని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే పట్టణ ప్రాంతాల్లో రాజకీయ నేతలు ఎవరూ లేకుండానే సోమవారం నుండి ఇంటింటికీ రేషన్ బియ్యాన్ని మొబైల్ వాహనాల ద్వారా అందిస్తాం అని అన్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం వచ్చాకే గ్రామాల్లోనూ అమలు చేస్తామని అన్నారు. అయితే తోలి విడత పంచాయతీ ఎన్నికల కి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.