తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక లో భారీ మెజారిటీతో గెలుస్తాం – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Sunday, March 28th, 2021, 09:40:19 PM IST

చిత్తూరు జిల్లా కుప్పం లో రూరల్ ఎలక్ట్రిక్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ను ఏపిఎస్పిడిసిఎల్ లో విలీనం చేయబోమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అయితే రెస్కో ను స్వాధీనం చేసుకొనేందుకు ఏపీఈఆర్సి ఇచ్చిన ఆదేశాలను తక్షణమే రద్దు చేయాలంటూ తెలుగు దేశం పార్టీ అధినేత, మాజి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీటి పై స్పందించడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈఆర్సి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనేలా ఆదేశాలు ఇస్తామని తెలిపారు. అయితే అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక పై సైతం మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక నేపథ్యం లో ఎమ్మెల్యేలు మరియు అక్కడి స్థానిక నేతలతో మంత్రి సమావేశం అయ్యారు. అయితే ఈ ఉప ఎన్నికలో వైసీపీ భారీ మెజారిటీ తో గెలుస్తుంది అని వ్యాఖ్యానించారు. అయితే జాతీయ స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పథకాలు చర్చించు కొనే విధంగా విజయం సాధిస్తాం అని వ్యాఖ్యానించారు. అయితే ప్రతి పక్ష పార్టీ నేతలు దీని పై అనవసర రాద్దాంతం చేస్తున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.