ఏపీ లో స్కూళ్ల పునఃప్రారంభం పై మరొక కీలక నిర్ణయం!

Tuesday, September 29th, 2020, 05:35:17 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లను పునః ప్రారంభించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 5 నుండి స్కూళ్ల పునఃప్రారంభం చేసేందుకు సిద్దం అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల రీత్యా వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై మంత్రి మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. అయితే నవంబర్ 2 నుండి స్కూళ్లు తెరవాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు.

అయితే స్కూళ్ల పునఃప్రారంభం వాయిదా పడినప్పటికీ అక్టోబర్ 5 న స్కూల్ పిల్లలకు జగనన్న విద్యా కానుక కిట్ లను ప్రభుత్వం అందజేయనుంది అని తెలిపారు. అక్టోబర్ 5 న జగనన్న విద్యా కానుక ప్రారంభం కానుంది అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం వీలుంటే ఏదైనా స్కూల్ కి వెళ్లి పరీక్షిస్తారు అని మంత్రి ఈ సమావేశం ద్వారా వెల్లడించారు.