ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రైతుల ఆత్మహత్యల పై కన్నబాబు కీలక వ్యాఖ్యలు

Sunday, September 6th, 2020, 04:00:22 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రైతుల ఆత్మహత్య ల పై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక ఆత్మహత్య లు తగ్గాయి అని తెలిపారు. రైతుల ఆత్మహత్య ల పై చంద్రబాబు నాయుడు అండ్ కో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఏడాది నుండి ఇప్పటి వరకూ రాష్ట్రం లో 33 మంది ఆత్మహత్య చేసుకున్నారు అని మంత్రి కన్నబాబు తెలిపారు.

అయితే సీఎం జగన్ పాలన లో ఆత్మహత్యలు తగ్గాయి అని తెలిపారు. చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ అధికారం లో ఉన్న 2019 వరకూ కూడా రాష్ట్రం లో అధిక సంఖ్య లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్రం లో చోటు చేసుకున్న రైతుల ఆత్మహత్యల పాపం ముమ్మాటికీ చంద్రబాబు దే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రైతులకు పలు పథకాలు ప్రవేశ పెట్టాం అని, ఏ రాష్ట్రం లో కూడా ఇలా ఎక్కువగా పథకాలు లేవు అని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం మాత్రమే కాకుండా పెట్టుబడి సహాయం కూడా చేస్తున్నట్లు మంత్రి వివరించారు. కన్నబాబు చేసిన వ్యాఖ్యలకి తెలుగు దేశం పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.