చంద్రబాబు ప్రజల్లో మరింత విష ప్రచారం చేస్తున్నారు – మంత్రి కన్నబాబు

Monday, May 10th, 2021, 12:00:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే పాజిటివ్ కేసులు మరియు మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటం పట్ల ప్రజలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మేరకు మంత్రి కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పూర్తి స్థాయిలో కరోనా ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వసతులు ఉన్నాయి అని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న చర్యలను మంత్రి కన్నబాబు వివరించే ప్రయత్నం చేశారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం అహర్నిశలు చర్యలు చేపడుతోంది అని వ్యాఖ్యానించారు. అయితే ప్రతి పక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు పదేపదే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. అయితే జాతీయ విపత్తులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా ఉండాలో తెలియడం లేదు అని ఆరోపించారు. అయితే దేశంలొ ప్రజలు అంతా కూడా భయ భ్రాంతులకు గురి అవుతుంటే, చంద్రబాబు ప్రజల్లో మరింత విష ప్రచారం చేస్తున్నారు అని విమర్శలు గుప్పించారు. అయితే చంద్రబాబు తాను చేసే పనికి సిగ్గు అనిపించడం లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే రాష్ట్రానికి చంద్రబాబే పెద్ద వైరస్ లా తయారు అయ్యాడు అని, రాజకీయాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్టాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.