ఆ లిస్ట్ లో చంద్రబాబు పై వరుసలో ఉంటారు – కురసాల కన్నబాబు

Sunday, February 14th, 2021, 09:24:33 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సిగ్గులేని రాజకీయ నాయకుల లిస్ట్ తీస్తే పై వరుస లో చంద్రబాబు ఉంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ, పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున గెలిచినట్లు ఆయన ప్రచారం చేసుకుంటున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.అయితే తొలిదశ ఎన్నికల్లో వైసీపీ సానుభూతి పరులు 85 శాతం వరకు విజయం సాధించారు అని, ఒక్క కాకినాడ రూరల్ లోనే 95 శాతం విజయం సాధించారు అంటూ మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. అయితే ఈ మేరకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కి ఒక సవాల్ విసిరారు.

చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ కి 38 శాతం పంచాయతీ లు వచ్చాయి అని ప్రచారం చేసుకుంటున్నారు అని, వాటి వివరాలను వెల్లడించాలని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా పని చేస్తున్నారు అంటూ, సక్రమం గా పని చేయడం లేదు అంటూ కొత్తగా ప్రచారం మొదలు పెట్టారు అని విమర్శలు గుప్పించారు. అయితే ఎన్నికల కమిషనర్ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారు అని ప్రచారం చేస్తే నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరు అని, ఎన్నికలకి భయపడే ప్రభుత్వం తమది కాదు అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. అయితే మున్సిపల్ ఎన్నికలు వచ్చినా, జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చేందుకు సిద్దం గా ఉన్నారు అంటూ మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అయితే కన్నబాబు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి.