పంచాయతీ ఎన్నికల్లో సీఎం జగన్ ప్రభంజనాన్ని ఆపలేరు – కురసాల కన్నబాబు

Thursday, February 11th, 2021, 07:28:02 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్దులు ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్ని కుయుక్తులు చేసినా, చంద్రబాబు ఎన్ని రకాలుగా అడ్డు తగిలినా, పంచాయితీ ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఆపలేరు అంటూ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యానించారు. పంచాయతి ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయ పరంపర కొనసాగింది అని, అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వగ్రామం లోనూ వైసీపీ సానుభూతి పరులు విజయం సాధించారు అంటూ మంత్రి పేర్కొన్నారు.

మీడియా సమావేశం లో మాట్లాడిన మంత్రి కన్నబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎన్నికలకు భయపడే పార్టీ కాదు అని, ఈ వేళ వాతావరణం అనుకూలంగా లేదు అని వ్యాఖ్యానించారు. ఆరోగ్య పరిస్థితులు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. అయితే కాకినాడ రూరల్ సొంత నియోజక వర్గంలో 35 పంచాయతీ స్థానాలకు 33 స్థానాలు వైసీపీ సానుభూతి పరులు విజయం సాధించడం పట్ల మంత్రి కురసాల కన్నబాబు హర్షం వ్యక్తం చేశారు.