ఏపీ అంబులెన్స్ లను ఆపడం లేదు – మంత్రి కురసాల కన్నబాబు

Thursday, May 13th, 2021, 07:27:46 AM IST

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే భారీగా నమోదు అవుతున్న కేసులు, మరణాల తో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే సరిహద్దుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అంబులెన్స్ లను సైతం తెలంగాణ పోలీసులు అడ్డుకోవడం పట్ల రాష్ట్ర హైకోర్టు అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ అంశాల పై మంత్రి కురసాల కన్నబాబు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి వైద్యం కోసం హైదరాబాద్ వెళ్ళే అంబులెన్స్ లను ఆపకుండా తెలంగాణ ప్రభుత్వం తో చర్చలు జరిపాం అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం తెలంగాణ సరిహద్దు వద్ద అంబులెన్స్ లను అడ్డుకోవడం లేదని ఆయన తెలిపారు.

అయితే కరోనా వైరస్ నివారణ కి ఒళ్లంతా ఆవు పేడ పూసుకోవాలి అని, ముక్కులో ఉల్లి రసం వేసుకోవాలి అని సూచిస్తూ సోషల్ మీడియా లో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దు అంటూ మంత్రి కన్నబాబు చెప్పుకొచ్చారు. అయితే శాస్త్రీయమైన, నిపుణులు సూచించే పరిష్కార మార్గాలనే పాటించాలి అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే కరోనా వైరస్ లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్య సేవలు పొందాలి అని కోరడం జరిగింది. అయితే మంత్రి కన్నబాబు చేసిన వ్యాఖ్యల తో కాస్త కరోనా వైరస్ రోగుల ఆందోళన తగ్గుముఖం పట్టేలా ఉంది.