ఆరోజు 50 కోట్లు, మంత్రి పదవి ఇస్తా అని బాబు నాకు ఎర వేశాడు – ఏపీ మంత్రి

Wednesday, October 7th, 2020, 12:05:51 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ కి మరియు తెలుగు దేశం పార్టీ కి సంబంధించిన నేతలు ఒకరి పై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నేత అయ్యన్న పాత్రుడు కార్మిక శాఖ మంత్రి జయరాం పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రి జయరాం స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యన్న పాత్రుడు కి మతి భ్రమించి మాట్లాడుతున్నారు అని ఆయన వ్యాఖ్యలు ఖండించారు.

అయితే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదు అని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి అంటూ అయ్యన్న పాత్రుడు కి కౌంటర్ ఇచ్చారు. అయితే 15 ఏళ్ల క్రితం మంజునాథ్, మను అనే సోదరుల ఇద్దరూ రైతుల వద్ద భూముల్ని కొనుగోలు చేసినట్లు వివరించారు. అయితే తాన్ 100 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. అయితే ఈ అంశం పై అవకతవకలు ఉన్నట్లు అనుమానం వచ్చి ఆస్పిరి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టినట్లు తెలిపారు.

అయితే ఒక రైతు 30 ఎకరాలు కొనుగోలు చేయకూడదా అని అయ్యన్న పాత్రుడు ను మంత్రి జయరాం సూటిగా ప్రశ్నించారు. అయితే 2 ఎకరాల భూమి ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఎలా ఎదిగాడు అనేది చెప్పాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ రోజు 50 కోట్లు, మంత్రి పదవి ఇస్తా అని చంద్రబాబు తనకు ఎర వేశాడు అని మంత్రి వ్యాఖ్యానించారు.