కరోనా ను ఎదుర్కొనేందుకు సీఎంఆర్ఎఫ్ లో భాగస్వాములు కావాలి – మంత్రి గౌతమ్ రెడ్డి

Friday, May 14th, 2021, 07:44:33 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా తీవ్రత మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. అదే తరహాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి సీఎంఆర్ఎఫ్ లో భాగస్వాములు కావాలి అంటూ మంత్రి గౌతమ్ రెడ్డి పిలుపు ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రజలకు పరిశ్రమలు అండగా ఉంటాయి అని, ఆక్సీజన్ పాలసీ, ఆక్సిజన్ తయారీ పాలసీ తీసుకు వస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ మేరకు మంత్రి గౌతమ్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ కి తన సొంత సంస్థ కేఎంసి నుండి కోటిన్నర రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

అయితే మంత్రి గౌతమ్ రెడ్డి పిలుపు మేరకు పలు పరిశ్రమలు ముందుకు వచ్చి విరాళాన్ని ప్రకటించాయి. అందులో అమర్ రాజ బ్యాటరీ సంస్థ సీఎంఆర్ఎఫ్ కి కోటి రూపాయల విరాళం ప్రకటించడం జరిగింది. చిత్తూరు జిల్లాలో 500 పడకల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపింది. అదే విధంగా హిందూస్తాన్ యూనిలివర్ సంస్థ తూర్పు గోదావరి జిల్లా కి 50 ఆక్సిజన్ కాన్సంట్రేషన్ల ను ఇస్తామని ప్రకటన చేసింది. సిసిఎల్ మరియు దిక్షస్ కంపెనీలు సైతం సీఎంఆర్ఎఫ్ కి భారీ గా విరాళాన్ని ప్రకటించాయి.