మీ తోకలు కత్తిరిస్తా అన్న మాటలు గుర్తుకులేదా?

Monday, November 16th, 2020, 08:08:42 PM IST

adimulapu-suresh

తెలుగు దేశం పార్టీ నాయకుల పై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.పేదలకు మేలు జరుగుతింటే టీడీపీ నాయకులు ఓర్వలేని తనంతో అసత్య ప్రచారాలకి దిగుతున్నారు అని అన్నారు. అయితే ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం లో మంత్రి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత తెలుగు దేశం పార్టీ పాలనలో దళితులు, బీసీలకు చేసిన నిర్వకాలని ప్రజలు మర్చిపోలేదు అని అన్నారు. అంతేకాక చంద్రబాబు చేసిన దళితులు గా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్న మాటలు మర్చిపోలేదు అని తెలిపారు.

అంతేకాక నాయి బ్రాహ్మణులు వచ్చి మాట్లాడుతుంటే మీకెంత ధైర్యం మీ తోకలు కత్తిరిస్తా అన్న మాటలు గుర్తుకు లేదా అని ధ్వజమెత్తారు.అంతేకాక మంత్రి వర్గ సహచరులు కూడా ప్రజల పై ఏ విధంగా నోరు పారేసుకున్నా రో తెలీదా అని సూటిగా ప్రశ్నించారు.అయితే ఇప్పుడు భూ ఆక్రమణలు అని మా పార్టీ పై లేనిపోని అభాండాలు వేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే భూముల్ని ఆక్రమించి రికార్డుల్లో కి చేర్చింది తెలుగు దేశం పార్టీ అని అన్నారు. మా హయం లో అన్యాయం గా ఒక్క ఎకరా కూడా ఆన్లైన్ చేసిన దాఖలా లేదని సవాల్ చేస్తున్నా అంటూ మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.